తూ.గో.లో దారుణం: భార్యను చంపిన భర్త..ఆపై ఆత్మహత్య

by  |
తూ.గో.లో దారుణం: భార్యను చంపిన భర్త..ఆపై ఆత్మహత్య
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీసు సమీపంలో ఎస్. ఆర్ ఎనక్లేవ్ అపార్ట్మెంట్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే నడింపల్లి నరసింహారాజు, వెంకటమణెమ్మ దంపతులు. నరసింహారాజు నిడదవోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా వెంకగమణెమ్మ ఉమెన్స్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇటీవలే విబేధాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భార్యను భర్త హత్య చేశాడు. అనంతరం నరసింహారాజు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు త్రీటౌన్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed