2021లో అత్యధిక వసూళ్లు సాధించిన PUBG మొబైల్.. ఎంతో ఊహించగలరా? 

124

దిశ, వెబ్‌డెస్క్: PUBG మొబైల్ డిసెంబర్ 2021నాటికి  ప్రపంచవ్యాప్తంగా $244 మిలియన్ల అత్యధిక వసూళ్లు చేసిన మొబైల్ గేమ్‌గా అవతరించింది. 2020 డిసెంబర్ నుంచి 36.7 శాతం వృద్ధిని సాధించింది. దాదాపు 68.3 శాతం ఆదాయం చైనా నుంచి వచ్చింది. US నుంచి 6.8 శాతం, టర్కీ నుండి 5.5 శాతం, వసూళ్లు సాధించినట్లు సెన్సార్ టవర్ ఓ నివేదిక ద్వారా తెలిపింది. miHoYo నుంచి Genshin ఇంపాక్ట్ గెమ్ డిసెంబర్ 2021 నాటికి $134.3 మిలియన్ల స్థూల ఆదాయంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న మొబైల్ గేమ్‌లలో రెండవ స్థానంలో నిలిచింది. జెన్‌షిన్ ఇంపాక్ట్ యొక్క ఆదాయంలో దాదాపు 28 శాతం చైనా నుంచి, 23.4 శాతం US నుండి వచ్చింది.

అలాగే తదుపరి అత్యధిక వసూళ్లు సాధించిన గేమ్ రోబ్లాక్స్ కార్పొరేషన్ నుంచి రాబ్లాక్స్, ఆ తర్వాత మూన్ యాక్టివ్ నుంచి ‘కాయిన్ మాస్టర్’  టెన్సెంట్ నుండి ‘హానర్ ఆఫ్ కింగ్స్’ ఉన్నాయి. గ్లోబల్ మొబైల్ గేమ్‌ల మార్కెట్ డిసెంబర్ 2021లో యాప్ స్టోర్, Google Play అంతటా ప్లేయర్ ఖర్చుల ద్వారా $7.4 బిలియన్‌లను ఆర్జించింది.ఈ వసూళ్లు గత సంవత్సరానికి కంటే 2 శాతం తగ్గింది. డిసెంబర్ 2021లో గ్లోబల్ రెవిన్యూలో నంబర్ వన్ మార్కెట్ US, ఇది $2.2 బిలియన్లు లేదా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆటగాళ్ల వ్యయంలో 29.6 శాతం సంపాదించింది. ఆదాయంలో జపాన్ 20.3 శాతం తో రెండవ స్థానంలో ఉంది, గూగుల్ ప్లే అందుబాటులో లేని చైనా 15.7 శాతానికి దగ్గరగా ఉంది.