హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

by  |
ap-high-court,
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన ప్రక్రియపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈనెల 22లోపు దాఖలైన అన్ని పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఈనెల 28 వరకు ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు విల్లింగ్ ఇవ్వలేదన్న కారణంతో ఆయా విద్యాసంస్థలకు గ్రాంట్ నిలిపివేయోద్దని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 28కు వాయిదా వేసింది.

Next Story

Most Viewed