ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

by  |
ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
X

న్యూఢిల్లీ: రోజురోజుకూ న్యూఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. 33 ప్రైవేట్ హాస్పిటళ్లలోని ఐసీయూ బెడ్లలో 80 శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దేశ రాజధానిలో పరిస్థితి గంభీరంగా ఉన్నది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

ఢిల్లీలో గడిచిన 24గంటల్లో కొత్తగా 8,597 కరోనా కేసులు నమోదు కాగా, 85మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో రోగులు మరణించడం ఇది రెండోసారి. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి కంటే ప్రస్తుతం మూడు రెట్లు ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed