డైరెక్టర్ కామెంట్లకు స్టేజ్ పైనే ఏడ్చిన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి..

by  |
sai pallavi
X

దిశ, వెబ్‌డెెస్క్: న్యాచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఆదివారం రోజు ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ.. హీరోయిన్ సాయిపల్లవి నటన, తనతో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడాడు. సాయిపల్లవి చాలా మంచి నటి అని, యాక్టింగ్ చాలా బాగా చేస్తుందని ప్రశంసించాడు. అంతే కాకుండా భవిష్యత్‌లో సాయిపల్లవి లెజెండరీ యాక్టర్ అవుతుందని ఆకాశానికెత్తాడు. దీనితో పక్కనే ఉన్న నటి కాస్త ఎమోషనల్ అయింది. కళ్లలో నీళ్లు రావడంతో పక్కనే ఉన్న హీరో నాని ఆమెను హత్తుకొని ఓదార్చాడు. వేడుకకు వచ్చిన అభిమానులంతా చప్పట్లతో సాయిపల్లవిని ఉత్సాహపరిచారు. ఈ సినిమాలో పల్లవి దేవాదాసి అనే పవర్ పుల్ రోల్ లో కనిపించనుంది.


Next Story

Most Viewed