'వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

by  |
వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ప్రజా ఆరోగ్య సంచాలకులు (డీపీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావును కోరారు. ఈ మేరకు గురువారం టీఎన్జీవో ప్రతినిధుల బృందం డీపీహెచ్ ను కలిసి ఉద్యోగుల సమస్యలను విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిపై వైద్య,ఆరోగ్య శాఖ ఉద్యోగులు అలుపెరగని పోరాటం చేస్తూ అరుదైన సేవలు అందించడంలో అగ్ర స్థానంలో నిలిచారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో అధిక జనాభా ఉందని, ఇంత జనాభా ఉన్న నగరంలో నమోదతున్న కరోనా కేసులు పెద్దగా లెక్కలోనికి రావన్నారు. వైరస్ నియంత్రణలో వైద్యారోగ్య శాఖ పనితీరు చాలా మెరుగ్గా ఉందన్నారు. ప్రజలు కొవిడ్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భౌతిక దూరం, మాస్క్ లను ధరించాలని, తరచుగా చేతులు శుభ్రం చేస్తూ వీలైనంత వరకు స్వీయ నియంత్రణ పాటించవలసిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీడీ శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రాజేందర్, ప్రభాకర్, డీఎంహెచ్ఎస్ యూనిట్ అధ్యక్షుడు మామిడి ప్రభాకర్, కార్యదర్శి హరి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed