అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

by  |
అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య
X

దిశ, సిరిసిల్ల: అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఇందిరమ్మకాలనీకి చెందిన నేత కార్మికుడు మోర శ్రీనివాస్(45) స్థానిక టెక్స్‌టైల్ పార్కులో పవర్ లూమ్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం కోసం కొంతమేర అప్పు చేశాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.

లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్థాపం చెంది, గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై చేనేత జౌళి శాఖ అధికారులు విచారణ చేపట్టారు. కొంత కాలంగా ఫిట్స్ రావడంతో చికిత్స కోసం డబ్బులు లేక బాధపడేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్య ప్రశాంతి బీడీ కార్మికురాలుగా పని చేస్తుంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Next Story