పెళ్లిలో ఆ పని చేసిన వరుడు.. పూజారి ముందే చెంప చెల్లుమనిపించిన పెళ్లి కూతురు

by  |
పెళ్లిలో ఆ పని చేసిన వరుడు.. పూజారి ముందే చెంప చెల్లుమనిపించిన పెళ్లి కూతురు
X

దిశ, వెబ్‌డెస్క్ : గుట్కా తినడం ఆరోగ్యానికి హానికరం. అయినా చాలా మంది గుట్కా తినడానికే ఇష్టపడుతారు. తిన కూడదు అని ఎంత చెప్పినా వినరు. అయితే గుట్కా ఓ పెళ్లి కొడుకు పరువును తీసింది. గుట్కా పరువు తీయడం ఏంటీ అనుకుంటున్నారా.. ఎవరైనా ఎక్కడైనా ఉన్నప్పుడు గుట్కా తింటారు. కానీ, ఓ వ్యక్తి ఏకంగా పెళ్లిమండపంలో పెళ్లి జరుగుతుంటే గుట్కా తిన్నాడు. అది చూసిన పెళ్లి కూతురు ఊకుంటుందా.. అయితే ఏం చేసిందో మీరే చూడండి.

వేద మంత్రాల సాక్షిగా పందిట్లో పెళ్లి జరుగుతుంది. పూజారి మంత్రాలు చదువుతున్నాడు.. ఆ మంత్రాలను పెళ్లి కొడుకును చెప్పమనగా పెళ్లి కొడుకు నత్తిగా నోట్లో గుట్కా నములుతూ పూజరి చెప్పిన మంత్రాలను చదువుతున్నాడు. ఇది గమనించిన పెళ్లి కూతురు ఒక్కసారిగా వరుడి చెంప చెళ్లు మనిపించింది. దీంతో బిక్కు బిక్కు మంటూ పెళ్లి కొడుకు గుట్కాను పక్కకు వెళ్లి ఉమ్మివేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది. వధువు ధైర్యానికి అందరూ ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు.


Next Story

Most Viewed