సూర్యాపేట: ప్రమాదం పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి

by  |
Governor Tamilisai
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేటలో కొత్తగా నిర్మించిన స్టేడియంలో 47వ జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదం పట్ల గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా.. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Next Story

Most Viewed