బడ్జెట్‌లో గ్రామీణం, మౌలికం, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి : అసోచామ్!

by  |
బడ్జెట్‌లో గ్రామీణం, మౌలికం, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి : అసోచామ్!
X

దిశ, వెబ్‌డెస్క్: మరో పదిరోజుల్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ప్రధానంగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్యంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కువ దృష్టి పెట్టాలని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) అభిప్రాయపడింది. ముఖ్యంగా గ్రామీణ రోడ్లపై పెట్టుబడులు పెట్టడం మేలని, అదేవిధంగా ఆరోగ్య సంరక్షణపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొంది. దీనివల్ల ఆర్థికవ్యవస్థను వృద్ధివైపునకు నడిపించేంద్కు సాహసోపేతమైన చర్యలు ప్రకటించాలని ఆశిస్తున్నట్టు ఇటీవల అసోచామ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వినీత్ అగర్వాల్ చెప్పారు.

అదేవిధంగా విద్య, వైద్యంపై వ్యయాలను పెంచాలని, జీఎస్టీ రేట్లలో సవరణ చర్యలు తీసుకోవాలని, వినియోగ-అనుసంధాన ఆర్థికవ్యవస్థలో డిమాండ్ తగ్గకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. మౌలిక సదుపాయాల వ్యయం, ముఖ్యంగా జాతీ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ కీలకమని చెప్పారు. ప్రధాని గ్రామసడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలకు కేటాయిమౌలు పెంచడం అత్యవసరమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను పెంచే చర్యలు తీసుకోవడం, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు కేటాయింపు పెంచాలన్నారు. ఇటీవల పెరిగిన టెక్నాలజీని వ్యవసాయ రంగంలోనూ ప్రోత్సహించాలని, దానికోసం తగిన నిధులను ఏర్పాటు చేయడం అవసరమని వినీత్ అగర్వాల్ వెల్లడించారు.

Next Story