డేగ కళ్ల నిఘా: ఈటల హితులెవరు.. శత్రువులెవరు..?

by  |
Itela Rajendar
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సునిశీతంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆయన ప్రెస్ మీట్ వరకు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకే పరిమితం అయిన నిఘా కళ్లు ఇప్పుడు రాష్ట్ర్ర వ్యాప్తంగా దృష్టి పెట్టాయి. ఈటల చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన వెనక బలం, బలగం ఉండి ఉంటుందన్నఅనుమానంతో ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకుని కదలికలపై ఆరా తీస్తున్నారు. ఏయే జిల్లాలకు చెందిన వారు ఈటలకు అండగా ఉంటారు, ఆయన వ్యతిరేకులు ఎవరూ అన్న వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వ్యతిరేకత వస్తుందా లేక ఒంటరిగా మిగిలిపోతాడా అన్న విషయాన్ని ప్రాధాన్యతా పెట్టుకుని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అంతేకాకుండా ఆయన ఇతర పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నారా అన్న విషయం కూడా తెలుసుకుంటున్నట్టు సమాచారం. బీసీ నేత కావడంతో బీసీ వర్గాల మద్దతు ఈటలకు ఎంత మేర మద్దతు లభించే అవకాశం ఉంటుంది, ఆయన ఏఏ వర్గాలను సమీకరించే అవకాశాలు ఉంటాయన్న కోణంలో ఇంటలీ జెన్స్ వర్గాలు తెలుసుకునే పనిలో పడ్డాయి.

ఫోన్ స్విచ్చాఫ్ చేసిన నాయకుడు..

పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి ఇంటలీజెన్స్ ఉన్నతాధికరులు శుక్రవారం రాత్రి కాల్ చేసి హైదరాబాద్ కు వచ్చి కలవాలని సూచించారు. అయితే ఆయన ఆ తరువాత ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో అతనిపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు అతని మూవ్ మెంట్ తెలుసుకునే పనిలో పడ్డరు. ఈటల శిబిరానికి వెల్లాడా, ఆయనత్ టచ్ లో ఉన్నాడా అన్న వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నానని తాను ఎవరికీ అందుబాటులోకి వెల్లనని సన్నిహితులతో అన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈటలకు అన్యాయం జరుగుతోందని సదరు ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపున శుక్రవారం రాత్రి ఓ మంత్రితో కలిసి ఉన్న పెద్దపల్లి జిల్లాకు చెందిన మరో టీఆర్ఎస్ నాయకున్ని వ్యక్తిగతంగా కలిసిన నిఘా వర్గాలు అతని మద్దతు ఎవరికీ, ఈటల వైపు వెల్తారా అని డైరక్ట్ గా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే తాను కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నానని తాను వేరే గ్రూపులో చేరేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం.

Next Story

Most Viewed