రగులుతున్న రహీంఖాన్ పేట.. పోలీసులపై విమర్శలు

by  |
రగులుతున్న రహీంఖాన్ పేట.. పోలీసులపై విమర్శలు
X

దిశ, సిరిసిల్ల, మానకొండూరు: డ్రైవర్ రెబ్బల వంశీ మృతితో సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే క్రమంలో పోలీసులకు, మృతుడి కుటుంబీకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వంశీ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు, ట్రాక్టర్ ఓనర్ ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టేందుకు వెల్తుండగా.. పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులు, మృతుని బంధువులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఇల్లంతకుంట ఎస్సై సకాలంలో స్పందించి ఉంటే సమస్య ఇంత వరకు వచ్చేది కాదని వెంటనే డి.ఎస్.పి ఆ పై స్థాయి అధికారి వచ్చి మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కేసు నమోదు చేసి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీస్ అధికారి తన స్వలాభం కోసం రేపు మాపు అంటూ కాలయాపన చేయడం వల్లే వంశీ మరణానికి దారి తీసిందని ఆరోపించారు. అయితే మృత దేహాన్ని ట్రాక్టర్ యజమాని ఇంటి ముందు పెట్టి ఆందోళన చేస్తున్నారు. “”.వి వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేస్తున్నారు. బాధిత వంశీ కుటుంబానికి న్యాయం ఛేయడంతో పాటు బాధ్యులైన వారందరిపై ఛట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాదికారులు సమీక్షిస్తున్నారు.


Next Story

Most Viewed