ఇవాళ్టి వేస్టేజ్ రేపటికి షాటేజ్: గవర్నర్

by  |
Credai-1
X

దిశ, శేరిలింగంపల్లి: క్రెడాయ్ తెలంగాణ ఆధ్వర్యంలో మొదటి టీఎస్ కాంక్లేవ్ కార్యక్రమం హైటెక్స్ హెచ్ ఐసీసీలో నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ముఖ్య అతిధిగా హాజరై కాంక్లేవ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో నిర్మాణరంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, 1616 లోనే రియల ఎస్టేట్ వ్యాపారం ప్రారంభమైందని, స్థిరాస్తి వ్యాపారులు నమ్మకానికి ప్రతిరూపంగా ఉండాలన్నారు. క్రెడాయ్ తెలంగాణ రోజురోజుకు ఎంతో వృద్ధి సాధిస్తుందని, అలాగే సామాజిక కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమవంతు కార్యక్రమాలు నిర్వహించాలని క్రెడాయ్ సభ్యులకు పిలుపునిచ్చారు. వెనకబడ్డ ప్రజలకోసం పనిచేయాలని, వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. డబుల్ బెడ్రూం, ట్రిపుల్ బెడ్రూంలతోపాటు ప్రతి ఒక్కరూ బుక్ రూమ్ లు నిర్మించుకోవాలన్నారు. ఇవాళ వేస్టేజ్ రేపటికి షాటేజ్ అవుతుందని.. అలాంటిది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. క్రెడాయ్ తెలంగాణ కేవలం డెవలపర్ల కోసమని కాకుండా వినియోగదారుల కోసం కూడా పనిచేస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15 చాప్టర్స్ తో 850 మంది సభ్యులను కలిగి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నామని, రెరాపై అవగాహన కల్పించడం, డెవలపర్లకు ఆయా రంగాల్లో తోడ్పాటునందిస్తున్నామని, టెక్నాలజీని బిల్డర్లకు అందుబాటులోకి తీసుకురావడం కోసం కృషి చేస్తామన్నారు.

క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. 2015లో ప్రారంభమైన క్రెడాయ్ తెలంగాణ దేశ వ్యాప్తంగా గుర్తింపును సాధించిందని, అది క్రెడాయ్ తెలంగాణ సభ్యులకే చెల్లుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రేడాయ్ తెలంగాణ ఎలక్రెడ్ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి అనంతరం మైహోం రామేశ్వర్ రావుకు జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్. ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వర్ రావు మాట్లాడుతూ.. చాలాకాలంగా క్వాలిటీ నిర్మాణాలు చేపట్టడంలో బిజీగా ఉన్నామని, గత కొద్ది సంవత్సరాలుగా నిర్మాణరంగానికి మంచి రోజులు నడుస్తున్నాయని, ఇదే ప్రోత్సాహం ఇకపై కూడా ఉంటుందని అన్నారు. స్థిరాస్తి వ్యాపారులు నమ్మకంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే వినియోగదారులకు నాణ్యమైన నిర్మాణాలు అందించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి, మురళీ కృష్ణ, క్రెడాయ్ సభ్యులు, డెవలపర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed