నా కూతురిని ప్రేమించా.. పెళ్లి చేయండి.. అంటూ కోర్టుకెక్కిన తండ్రి

by  |
నా కూతురిని ప్రేమించా.. పెళ్లి చేయండి.. అంటూ కోర్టుకెక్కిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: బంధాలు, బంధుత్వాలకు ప్రస్తుత సమాజంలో విలువ లేకుండా పోతుంది. అన్న, వదిన, చెల్లి, కూతురు అనే సంబంధాలకు అర్ధం మార్చేస్తున్నారు. ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు కానీ వావి వరుసా ఉండాలిగా.. కన్న బిడ్డను పెళ్ళాడి ఆమెకు భర్తగా మారాలనుకున్నాడు ఒక తండ్రి. కన్న కూతురును అల్లారు ముద్దుగా పెంచి ఒక అయ్య చేతిలో పెట్టాల్సిన ఆ తండ్రి.. ఆమెనే తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది తప్పు అని అందరు చెప్పడంతో.. తనకు న్యాయం కావాలని కోర్టుకెక్కాడు. ఈ దారుణ సంఘటన అమెరికాలో వెలుగు చూసింది.

అమెరికాలోని మాన్​ హాటన్​ లో ఒక వ్యక్తి, తనకు పుట్టిన బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. ఆ ప్రేమ తండ్రికి కూతురిమీద ఉండే ప్రేమ కాదని ఆమె పెరిగే వయసులో అతనికి తెలిసింది. ఆమె వయసుకు వచ్చాక కూతురిపై ప్రేమ పిచ్చిగా మారింది. దీంతో కూతుర్నే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన వివరాలేమీ బయటపెట్టకుండా కోర్టులో కేసు వేశాడు. ఈ విచిత్ర కేసుపై స్పందించిన న్యాయస్థానం అతడి కేసుని కొట్టి పారేసింది. అయితే ఆ వ్యక్తి మాత్రం తగ్గలేదు పై కోర్టుకి వెళ్ళాడు. ఒక దృఢమైన సంబంధం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటే వారు పెళ్లి చేసుకోవచ్చని, వారిని విడదీసే హక్కు ఎవరికి లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇలాంటి పెళ్లిళ్లను అనుమతించని చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్​ చేశాడు. చివరికి పై కోర్టు సైతం ఇలాంటి అనైతిక సంబంధాలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసిచెప్పింది. దీంతో అతను తన కూతుర్ని పెళ్లి చేసుకొనే వరకు పోరాడతానని చెప్పాడు.


Next Story

Most Viewed