ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇంటివద్దకే ఆక్సిజన్

by  |
Oxygen Cylinders
X

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఆస్పత్రులలో బెడ్లు లేక కొవిడ్-19 సోకిన పేషెంట్లు వాటి ముందు పడిగాపులు కాస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకిన వ్యక్తికి ఇంటి వద్దే రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటే అక్కడికే ఆక్సిజన్ సిలిండర్లను పంపిస్తామని ప్రకటించింది. దీని కోసం బాధితులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఇంటివద్దకే ఆక్సిజన్ సిలిండర్లను డెలివరీ చేస్తామని తెలిపింది. ఇందుకోసం బాధిత పేషెంట్లు చేయాల్సిందల్లా https://delhi.gov.in. సైట్‌కు వెళ్లి ఆక్సిజన్ సిలిండర్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇందుకుగాను వాళ్ల ఆధార్ కార్డు, ఫోటోలు, కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, ఒకవేళ ఉంటే సిటీ స్కాన్‌నూ జతపరుచుతూ తమకు ఆక్సిజన్ కావాలని కోరితే ఇంటికే డెలివరీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Next Story