యాదాద్రి జిల్లాలో వలస కార్మికుడు మృతి

by  |

దిశ, నల్లగొండ: ప్రజలను ఓ వైపు కరోనా భయపెడుతుంటే మరో వైపు భానుడు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఓ వలస కార్మికుడు వందల కిలో మీటర్ల దూరం నుంచి ఇక్కడికి బతుకుదెరువు కోసం వచ్చాడు. కానీ, కరోనా కారణంగా తిరిగి స్వస్థలానికి చేరుతున్న సమయంలో అతను అనంతలోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద శనివారం ఉదయం ఛత్తీస్‌గడ్ కు చెందిన ఓ వలస కూలీ మృతిచెందాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ వలస కూలీలంతా ఇక్కడి నుంచి జాతీయ రహదారి గుండా కాలినడకన తమ స్వస్థలాలకు వెళుతున్నారు. అందులో ఓ కార్మికుడు వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడిని విశ్రాంతి కోసమని ఓ చెట్టు కిందికి తీసుకెళ్లారు. ఈ సమయంలోనే అతను ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed