తల్లి రుణం తీర్చుకున్న కూతురు…

by  |
తల్లి రుణం తీర్చుకున్న కూతురు…
X

దిశ, మానకొండూరు : హిందూ సాంప్రదాయాలు ప్రకారం తల్లిదండ్రులేవరైన మరణిస్తే కొడుకే చితిపెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొడుకులు లేకున్నా కన్న కూతురే అంతిమ సంస్కారాలు చేయడం ఊటూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూరు మండలం ఊటూర్ గ్రామంలో తిట్ల సాయమ్మ (80) అనే వృద్ధురాలు గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతురాలుకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే చిన్న కూతురు లక్ష్మి, తల్లి సాయమ్మ అంతిమ సంస్కారాలు చేసి, కొడుకు లేని లోటును తీర్చడంతో ఈ సన్నివేశాన్ని చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. కూతురు లక్ష్మిని గ్రామస్థులు అభినందించారు.


Next Story

Most Viewed