కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: సిపిఎం

by  |
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: సిపిఎం
X

దిశ, అచ్చంపేట రూరల్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ అచ్చంపేట సిపిఎం పార్టీ మండల కమిటీ డిమాండ్ జేసింది. నడింపల్లి, హాజీపూర్, చెన్నారం గ్రామాలలో ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్, మల్లేష్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనకుండా, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వరి ధాన్యాన్ని ఒక్క గింజ కూడా వదలకుండా కొంటాను అని చెప్పారు.

కానీ ఇంకా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పైన నెట్టి వేయడం, మిల్లర్ల పైకి తప్పును తోసేయడం, ప్రభుత్వానికి ఏమి సంబంధం లేనట్టు వ్యవహరించడం బాధాకరం అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, ముఖ్యమంత్రి వెంటనే వరిధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాలుకు రెండు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట ఎన్నికలు దాటిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడటం కేసీఆర్ కు పరిపాటిగా మారిపోయిందన్నారు.

Next Story

Most Viewed