బ్రేకింగ్ న్యూస్.. బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై నివేదిక.. కీలక విషయాలు బయట పెట్టిన కమిటి..

100
Defence Chief Bipin Rawat

దిశ, వెబ్ డెస్క్:  బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం పై విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ కమిటి నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక లో పలు కీలక విషయాలను బయటపెట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చింది. సాంకేతిక సమస్య వల్ల హెలి కాప్టర్ కూలలేదని, కేవలం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రకటించింది. ఫ్లైట్ గేటా రికార్డర్ ను కాక్ పిట్ వాయిస్ రికార్డును పరిశీలించామని తెలిపింది.

వాతావరణంలో హఠాత్తుగా మార్పులు ఏర్పడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తన నివేదికలో తెలిపింది. అయితే డిసెంబర్ 8న తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.