- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మర్యాదలు సరిగ్గా చేయలేదని..పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు

దిశ, ఏపీ బ్యూరో: మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కుమారుడు..పెళ్లి కుమార్తె పెళ్లి పీటలపై కూర్చున్నారు. తాళికట్టే కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో మర్యాదలు సరిగ్గా లేవని వధువు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పెళ్లి కూతురు పెళ్లి పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో అర్థాంతరంగా పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది. మరికొన్ని క్షణాల్లో వరుడు వధువు మెడలో తాళికట్టబోతున్నాడు. అందుకు సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది. బంధువులు..కుటుంబ సభ్యులు..ఆప్తులతో కళ్యాణమండపం సందడిగా మారింది.
ఇంతలో వధువు తరపు బంధువులు తమకు సరిగ్గా మర్యాదలు చేయడం లేదని అలిగారు. ఈ విషయం వధువుకు తెలిసింది. అంతే పెళ్లిపీటలపై నుంచి లేచి వచ్చేసింది. ఈ పెళ్లి వద్దంటూ తమ బంధువులు..కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది. అర్థాంతరంగా వధువు బంధువులు పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోవడంతో వరుడి కుటుంబం షాక్‌కు గురైంది. ఈ ఘటనపై వరుడు శేఖరాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.