చిత్తూరు జిల్లాలో విషాదం.. కోర్టు ఆవరణలో బాలుడు మృతి

by  |
చిత్తూరు జిల్లాలో విషాదం.. కోర్టు ఆవరణలో బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పుంగనూరులో మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు వచ్చిన ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలోనే బాలుడు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుమకున్నాయి. వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం బాలుడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా బాలుడికి నయం కాకపోవడంతో.. కోర్టు తనకు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో ఈ బాలుడు కోర్టుకు చేరుకోగా అకస్మాత్తుగా మృతిచెందాడు.

Next Story

Most Viewed