కిల్లర్‌గా మారిన పిల్లర్.. అసలేమైందంటే …?

by  |
కిల్లర్‌గా మారిన పిల్లర్.. అసలేమైందంటే …?
X

దిశ, ఆసిఫాబాద్: మండలంలోని భాగ్యనగర్ కాలనీలో ప్రమాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రహదారి పక్కన ఆడుకుంటన్న సమయంలో సిమెంట్ పిల్లర్ మీద పడడంతో ఈశ్వర్ (7) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే బాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ అశోక్‌లు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed