తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఫ్లైఓవర్‌పై నుండి..

by  |
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఫ్లైఓవర్‌పై నుండి..
X

దిశ, శేరిలింగంపల్లి: కొండాపూర్ మార్గంలో పెను ప్రమాదం తప్పింది. అక్కడ నూతనంగా చేపట్టిన ప్లైఓవర్ నిర్మాణం నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరుగుతుండగా తాజాగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం గచ్చిబౌలి నుంచి కొండాపూర్ మార్గంలో కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ప్లైఓవర్ పై నుంచి భారీ ఇనుప రాడ్డు కారుపై పడింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ మహేంద్ర ఎస్ యూవీ కారు ముందు భాగం దెబ్బతింది. ఎటువంటి జాగ్రత్త చర్యలు లేకుండా నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్, పనులను పర్యవేక్షిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కారు యజమాని సత్య ప్రవీణ్ డిమాండ్ చేశారు.

Next Story