IPL వేలంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ.. అన్ని క్రికెట్ బోర్డులకు లేఖ

110

బెంగళూరు: త్వరలో నిర్వహించనున్న ఐపీఎల్ వేలం కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సర్వం సిద్ధం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ వేలం నిర్వహించి తీరుతామని బీసీసీఐ స్పష్టం గురువారం చేసింది. ఈ క్రమంలోనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు బీసీసీఐ లేఖలు రాసింది. ఐపీఎల్‌లో పాల్గొనదలచిన ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను ఎంట్రీ చేసి జనవరి 17లోపు పంపించాలని అందులో పేర్కొన్నారు.

బెంగళూరు వేదికగా జరిగే వేలంలో గతేడాది 8 జట్లు పొల్గొంటే ఈసారి 10 జట్లు పాల్గొననున్నాయని ప్రకటించింది. 1000 కంటే తక్కువ పేర్లు నమోదవుతాయని బీసీసీఐ ఆశిస్తుండగా.. భారత బోర్డు ఆటగాళ్లు జాబితాను కుదించి 250 మందిని పూల్ కోసం విడుదల చేస్తుందని సమాచారం. ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్, లక్నో జట్లు జనవరి 22 నాటికి తమ ఆటగాళ్లు చెరో ముగ్గురిని ఎంపిక చేసుకున్నాక తుది జాబితాను బీసీసీఐ విడుదల చేయనుంది.

ఈసారి ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల డామినేషన్ కొనసాగనుందని తెలుస్తోంది. ఇదిలాఉండగా ఐపీఎల్ పైన ఇంగ్లాండ్ బోర్డు వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఐపీఎల్ వలన తమ ఆటగాళ్లు దేశీయ ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో విఫలమవుతున్నారని ఫైర్ అయ్యింది. ఇక ఆస్ట్రేలియా పాక్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20ని ప్లాన్ చేసింది. దీంతో ఐపీఎల్ వేలానికి ఆటంకం కలుగొచ్చని తెలుస్తుండగా.. వేలం మాత్రం కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది.