వారికి జగన్ సర్కార్ సీరియస్ వార్నింగ్

by  |
వారికి జగన్ సర్కార్ సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీటీ స్కాన్, హెచ్‌ఆర్ సీటీ ధరను రూ.3 వేలుగా నిర్ణయించింది. అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీటీ స్కాన్ వివరాలు, కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలను కరోనా డాష్ బోర్డులో నమోదు చేయాలని ఆదేశించింది.

కరోనా రోగి పేరు, ఫోన్ నెంబర్, సిటీ/హెచ్‌ఆర్ సీటీ స్కాన్ ఇమేజి, సీటీ స్కాన్ సైన్డ్ కాపీ వివరాలను డాష్ బోర్డులో నిక్షిప్తం చేయాలని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇది అమలయ్యేలా జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది.

Next Story