ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించాలి..

by  |
ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించాలి..
X

దిశ, శాయంపేట: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారి సీఎస్ సోమేష్ కుమార్ సమాచార హక్కు చట్టాన్ని నీరు కార్చడానికి జారీ చేసిన సర్క్యులర్ చెల్లదని హైకోర్టు తెలపడం అభినందనీయమని రాష్ట్ర తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి వంగర సాంబయ్య, శాయంపేట మండల కార్యదర్శి తట్ల రమేష్ అన్నారు. శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరు మాట్లాడారు.

సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడిచే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ప్రజల విజయమని, భవిష్యత్తులో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా ఉత్తర్వులు జారీ చేయడం తర్వాత ఉపసంహరించుకోవడం మామూలు అయిపోయిందని, కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్య పాలన లో సరైంది కాదని మండిపడ్డారు. భవిష్యత్తులో ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయడానికి ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు, కవులు కళాకారులు ఏకం కావాలని కోరారు.



Next Story

Most Viewed