యాదాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

by  |
యాదాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
X

దిశ, ఆలేరు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పది రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం అష్టోత్తరశత అభిషేకంతో పూర్తయ్యాయి. ఉదయం పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం బాలాలయంలో స్వామి అమ్మవార్లకు ఎదురుగా 108 వెండి కళశాలను ఏర్పాటు చేశారు. వాటిలో సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, వనమూలికలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటికి ఎదురుగా ఉంచిన బంగారు కలశాలకూ విశేష పూజలు నిర్వహించారు.

అనంతరం అర్చకులు వాటిని తీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఋత్విక్కులు, వేద పండితులు వేద మంత్రాలతో దాదాపు నాలుగు గంటలపాటు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ తీర్థం తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, అర్ఛకులు మోహనాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింత పట్ల రంగాచార్యులు, సురేంద్రాచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి , అధికారులు దోర్బల భాస్కరశర్మ , గజ్వేల్ రమేశ్, నరేశ్, వాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story