రూటు మార్చిన తాలిబన్లు.. ఈ సారి ఎవరికి మూడిందంటే?

by  |
రూటు మార్చిన తాలిబన్లు.. ఈ సారి ఎవరికి మూడిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది తాలిబన్ల మాటలు. ఇంతకాలం కయ్యానికి కాలు దువ్విన ఈ ఉగ్రమూకలు ఇప్పుడు తాము ప్రపంచ శాంతి దూతలం అంటూ మాట్లాడుతున్నారు. అంతేనా ఇప్పుడు ఏ దేశంతోనూ తమకు విరోదం అవసరం లేదని, మేము ఏ దేశంతోనూ శతృత్వం పెంచుకోవాలి అనుకోవడం లేదని తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్ ఖాన్ తెలిపారు. అప్పట్లో ఒక అఫ్గన్ మహిళ తాలిబన్ అగ్రనాయకుడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత దేశం వదిలి విదేశాల్లో తల దాచుకునే పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఏ జర్నలిస్ట్ కూడా తాలిబన్లను ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు తాలిబన్లే నయానో బయానో జర్నలిస్టులను రప్పించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

చాలా కాలం తర్వాత బీబీసీ ఉర్దూ మహిళా జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఉగ్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా చాలా అంశాల మీద ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. మహిళల అభివృద్ది, విదేశాలతో తాలిబన్ల వైఖరి, భారత్ లో ఏర్పాటు చేసిన అఫ్గన్ మీటింగ్ ఇలా చాలా విషయాల పై ప్రశ్నించింది. అఫ్గన్ ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం ఇచ్చిందని, రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందిస్తామని విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ అన్నారు. ఇక అన్ని దేశాలతో సామరస్యంగా వ్యవహరిస్తామని, శతృత్వానికి తమ ప్రభుత్వ సిద్ధంగా లేదని తెలిపారు. చాలా ప్రాంతాల్లో స్కూల్స్ బంద్ చేశామనే వార్తలు వస్తున్నాయని, అవి కేవలం కరోనా కారణంగానే మూత పడ్డాయని, త్వరలోనే అన్ని తెరుస్తాం అని వివరించారు.

భారతదేశం అఫ్గన్ విషయంలో చూపుతున్న చొరవకు నిజంగా జోహార్లు అని అన్నారు. మరి మీరు భారత్ తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారు అయితే పాక్, చైనా లు దీనిపై ఏమైనా స్పందించాయా అని అడిగింది రిపోర్టర్. ఈ ప్రశ్నకు మాత్రం తాలిబన్ నేత సమాధానం ఇవ్వలేదు. మాస్కోలో మొన్న జరిగిన సదస్సులో భారత్, పాక్ లతో పాటూ అనేక దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యామని తెలిపారు.

అఫ్గన్ సంక్షోభ పరిస్థితుల పై భారత్ ఎనిమిది దేశాలతో ఢిల్లీలో ఒక సదస్సును నిర్వహించింది. ఇందుకు తాలిబన్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. భారత్ చూపుతున్న చొరవకు నిజంగా రుణ పడి ఉన్నాం, అంతే కాక అఫ్గన్ నుంచి ఏ ఇతర దేశాలకు ముప్పు ఉండదని అన్ని దేశాలకు హామీ ఇస్తున్నామన్నారు.

Next Story