మార్చి చివరలో టెన్త్ పరీక్షలు.. దసరాకు సెలవులు ఎన్ని రోజులంటే.?

by  |
మార్చి చివరలో టెన్త్ పరీక్షలు.. దసరాకు సెలవులు ఎన్ని రోజులంటే.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ విడుదలైంది. పాఠశాల పనిదినాలను, సెలవులను, వార్షిక పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల పనిదినాలను 213 రోజుల పాటు నిర్ణయించగా వీటిలో జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు 47 రోజుల పాటు నిర్వహించిన ఆన్ లైన్ క్లాసులను కూడా జత చేశారు.

మార్చి చివరల్లో టెన్త్ పరీక్షలు..

పదోతరగతి పరీక్షలను మార్చి నెల చివరల్లో నిర్వహించనున్నారు. ఇందు కోసం 2022 జనవరి 10 వరకు సిలబస్‌ను పూర్తిచేసి విద్యార్థులకు సబ్జెక్ట్‌ల వారీగా రివిజన్‌ను చేపడుతారు. ఫిబ్రవరి 28 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలను పూర్తి చేసి వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తారు. ఏప్రిల్ నెలలో 9వ తరగతి వరకు పరీక్షలను పూర్తి చేసి.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవును ప్రకటించారు.

సంక్రాంతికి ఆరు రోజులే సెలవులు..

దసరా పండుగకు 12 రోజుల సెలవులను కేటాయించిన ప్రభుత్వం.. సంక్రాంతికి 6 రోజులు మాత్రమే సెలవులను ప్రకటించింది. 2021 అక్టోబర్ 06 నుంచి 17 వరకు దసరా సెలవులను, 2022 జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను కేటాయించారు. మిషనరీ స్కూల్స్‌లో క్రిస్మస్ సెలవులను 2021 డిసెంబర్ 22 నుంచి 28 వరకు 7 రోజులు పాటు కేటాయించారు.



Next Story

Most Viewed