పోసాని vs జన సైనికులు.. ప్రెస్‌క్లబ్ వద్ద ఉద్రిక్తత

by  |
Janasena activists
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తోన్న నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్‌ను అడ్డుకునేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడకి చేరుకొని జనసైనికులను అడ్డుకొని అరెస్ట్ చేశారు. ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను పోసాని ఖండించారు. అంతేగాకుండా.. సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించి పవన్‌పై విమర్శలు చేశారు. దీంతో అభిమానుల నుంచి పోసానికి పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ రావడంతో మంగళవారం మరోసారి ప్రెస్‌మీట్ నిర్వహించి పవన్‌పై విమర్శలు చేస్తుండగా, ఆగ్రహం వ్యక్తం చేసిన జనసైనికులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్దకు భారీగా చేరుకొని ప్రెస్‌మీట్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

పోసాని ఘాటు వ్యాఖ్యలపై పవన్ కౌంటర్.. కుక్కలు మొరుగుతాయ్ అంటూ

Social look of Celebrities trending on social media

Next Story

Most Viewed