అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web |
అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: ప్రజలందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద నగర్‌లో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రహదారి పనులను ప్రారంభించారు. ఈ సంధర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని రహదారులను సిసి లేదా బిటి రహదారులుగా తీర్చిదిద్దేందుకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణంలో రహదారులు అందంగా ఉండడమే కాకుండా, పూర్తి నాణ్యతగా నిర్మించి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వ పనుల విషయంలో ప్రజలతోపాటు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పరిశీలించాలని కోరారు. వార్డు కౌన్సిలర్‌లు ప్రతిరోజు ఉదయమే వార్డులో పర్యటించాలని మంత్రి ఆధేశించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కెసి నరసింహులు, కౌన్సిలర్లు గోవింద్, కిషోర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, బెంజిమెన్ తదితరులు ఉన్నారు.

Next Story