ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి

by Jakkula.Mamatha |

తల్లాడ మండల పరిధిలోని జాతీయ రహదారి మార్గంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి
X

దిశ,తల్లాడ: తల్లాడ మండల పరిధిలోని జాతీయ రహదారి మార్గంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనకనుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలకు వెళ్తే వైరా మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన చవళ్ళ ఉపేందర్(28) కల్లూరు మండలంలోని హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తనకు సోమవారం నైట్ డ్యూటీ కావడంతో రోజు విధంగానే పాల ఫ్యాక్టరీకి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

తల్లాడ మండల పరిధిలో రెడ్డిగూడెం గ్రామ సమీపంలోని హెచ్‌పి పెట్రోల్ బంకు వద్ద ట్రాక్టరుకు డిజిల్ అయిపోవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో ఇది గమనించని ఉపేందర్ ద్విచక్ర వాహనం అదుపుతప్పి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపేందర్ అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్యూటీకి వెళ్లాల్సిన కొడుకు తిరిగిరాని అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story