'జస్ట్ ఫ‌ర్ లివింగ్' సంస్థ సేవ‌లు అభినంద‌నీయం: అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్

by Vinod kumar |
జస్ట్ ఫ‌ర్ లివింగ్ సంస్థ సేవ‌లు అభినంద‌నీయం: అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్
X

దిశ‌, మ‌రిపెడ: ఆప‌ద‌లో ఉన్న వారిని ఆర్థిక సాయంతో ఆదుకోవాల‌నే దృక్పథంతో ప‌నిచేస్తున్న 'జ‌స్ట్‌ ఫ‌ర్ లివింగ్' సంస్థ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని మ‌హ‌బూబాబాద్ అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ కొనియాడారు. ఈ మేరకు మంగళవారం నిట్ లో 321 ర్యాంక్ సాధించిన బ‌య్యారంగ మండ‌ల‌ కేంద్రానికి చెందిన‌ పావణికి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని జస్ట్ ఫర్ లివింగ్ సంస్థ నిర్వాహకులు గండి సీతారాం గౌడ్-గీత దంపతులు.. అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా అద్యక్షుడు సిహెచ్. శ్రీనివాస్ చేతుల మీదుగా అంద‌జేశారు.


డోర్నకల్ ప్రభుత్వ పాఠశాలలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో పదవ తరగతి చదువుతున్న సుమారు డెబ్భై మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. సాటి మనిషికి సహాయం చేయాలనే సంకల్పంతో జస్ట్ పర్ లివింగ్ సంస్థను నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ గండి సీతారాంగౌడ్-గీత దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. టీయూడ‌బ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..ఆ దంప‌తులు జ‌స్ట్ ఫ‌ర్ లివింగ్ సంస్థ ద్వారా సహాయ కార్యక్రమాలు చేప‌డుతూ వారి సేవాభావాన్ని చాటుకుంటున్నార‌న్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ సీఐ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed