వైసీపీ క్రిమినల్ ఆలోచనలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ :ఎంపీ రఘురామ కృష్ణంరాజు

by Dishanational1 |
వైసీపీ క్రిమినల్ ఆలోచనలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్  :ఎంపీ రఘురామ కృష్ణంరాజు
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి నిప్పులు చెరిగారు. తనను అరెస్ట్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో శనివారం మాట్లడారు. ఈ సందర్భంగా తనను మరోసారి అరెస్టు చేసేందుకు అధికార పార్టీ నేతలు, అధికారులు కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగా భీమవరంలోని తన ఇంటికి వెళ్లే దారిని రాత్రికి రాత్రే స్థానిక అధికారులు దగ్గర ఉండి మరీ తవ్వించేశారని చెప్పుకొచ్చారు. ఇదంతా అటు అధికారులు, ఇటు పోలీసులు కలిపి కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

రోడ్డును తవ్వేసిన నేపథ్యంలో తాను నడుచుకుంటూ వెళ్లేందుకే ఇలా చేశారని విమర్శించారు. ఆ సమయంలో తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు అధికారులు పోలీసులతో కలిసి కుట్ర చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసే విషయంలో వైసీపీ ప్రభుత్వ వ్యూహాలను చూస్తే చాలా కృరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. వీళ్ల క్రిమినల్ ఆలోచనలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెటైర్లు వేశారు.

ఇకపోతే ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈనెల 4న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో పాల్గొనేందుకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తనకు రక్షించాలంటూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ లంచ్ మోషన్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారించిన హైకోర్టు వ్యక్తులపై కేసులు నమోదు చేసినప్పుడు వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పోలీసులు న్యాయ నిబంధనలు పాటించాలని కూడా సూచించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed