ఆత్మకూరు ఉప ఎనికలో YCP భారీ విజయం

by Disha Web Desk 2 |
ఆత్మకూరు ఉప ఎనికలో YCP భారీ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. 82,888 ఓట్ల మెజార్టీతో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌.. విక్రమ్‌ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ‍్వలేదు. ఇక, పోస్టల్‌ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్‌ ఓట్లలోనూ వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 82,888, బీజేపీకి 18,216, బీఎస్పీకి 4,773, నోటాకు 3,972 ఓట్లు వచ్చాయి.


Next Story

Most Viewed