Xiaomi నుంచి తక్కువ ధరలో అత్యాధునిక 4K స్మార్ట్ టీవీ

by Disha Web Desk 17 |
Xiaomi నుంచి తక్కువ ధరలో అత్యాధునిక 4K స్మార్ట్ టీవీ
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ కంపెనీ Xiaomi సరికొత్త అత్యాధునిక స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. భారత్‌లో పెరుగుతున్న స్మార్ట్ టీవీల విభాగంలో ఇతర సంస్థలకు గట్టీ పోటీ ఇవ్వడానికి Xiaomi TV A2 సిరీస్‌లో 32-అంగుళాల, 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల టీవీలను భారత్‌లో లాంచ్ చేసింది. అన్ని TVలు 60Hz రిఫ్రెష్ రేట్‌తో డాల్బీ విజన్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. A2 మోడల్ 32-అంగుళాల TV HD-రెడీ (1366x768 పిక్సెల్‌లు) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల మోడల్‌లు 4K (3840x2160 పిక్సెల్‌లు) రిజల్యూషన్ అల్ట్రా HD డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. టీవీలు సింగిల్ స్టాండ్‌తో సపోర్టు చేయబడిన మెటల్ ఫ్రేమ్‌తో యూనిబాడీ బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తున్నాయి. 178-డిగ్రీల వరకు టీవీలో వచ్చే సన్నివేశాలు క్లియర్‌గా చూడవచ్చు.



ఫీచర్ల పరంగా TVలు క్వాడ్-కోర్ కార్టెక్స్-A55 CPU ద్వారా పనిచేస్తాయి. 360-డిగ్రీ బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఎటువైపు నుంచైనా TV ని ఆపరేట్ చేయవచ్చు. 32-అంగుళాల టీవీలో 1.5GB RAM, 8GB స్టోరేజ్ ఉంది. 4K మోడల్‌లు 2GB RAM, 16GB స్టోరేజీని కలిగి ఉన్నాయి. 32-అంగుళాల Xiaomi TV రెండు HDMI పోర్ట్‌లు, 4K మోడల్‌లు మూడు HDMI, రెండు USB పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. Wi-Fi, బ్లూటూత్ v5.0 సపోర్ట్‌తో టీవీలు పనిచేస్తాయి. 32-అంగుళాల TV 10W ఆడియో అవుట్‌పుట్‌ను, 43, 50, 55-అంగుళాల TVలు 12W ఆడియో అవుట్‌పుట్‌‌‌తో వస్తున్నాయి. అన్ని టీవీలలో డాల్బీ ఆడియోతో పాటు DTS-HD సపోర్ట్ ఉంది. Xiaomi 55-అంగుళాల TV ధర రూ. 43,600. ఇతర టీవీలు ఇంత కంటే తక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది.


Next Story

Most Viewed