జిల్లాల చరిత్ర తెలిపే గ్రంథాలు వచ్చేస్తున్నాయ్

by Disha Web Desk 2 |
జిల్లాల చరిత్ర తెలిపే గ్రంథాలు వచ్చేస్తున్నాయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో ఏర్పడగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం 33 జిల్లాలుగా విభజించారు. అయితే, ఈ 33 జిల్లాల భౌగోళిక స్థితిగతులన్నీ తెలియజేసేలా ప్రత్యేక పుస్తకాన్ని తీసుకురావాలని రాష్ట్ర సారస్వత పరిషత్‌ నిర్ణయించింది. ఈ సందర్భంగా సాహిత్య సాంస్కృతికోత్సవాల పేరిట జిల్లాకో గ్రంథాన్ని ముద్రించేందుకు జిల్లాల వారీగా కన్వీనర్లను ఎంపిక చేసింది. ప్రధానంగా చారిత్రక, భౌగోళిక, సాహిత్యం, కళలు, ఉద్యమాలు, పురాతన కట్టడాలు, ప్రముఖులు వంటి అన్ని కోణాలను తెలియజేసేలా పుస్తకాలు తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహించిన పుస్తకాలను జనాల్లోకి తీసుకెళ్లనున్నారు. అయితే, ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలోని కవులు, రచయితలు దీనికి సంబంధించిన అంశాలపై సమాలోచనలు చేయడం గమనార్హం.

Next Story

Most Viewed