‘ప్రభుత్వం చేనేత సహకార సంఘాల కార్మికుల పై దృష్టి పెట్టాలి’.. కార్మికుల డిమాండ్

by Jakkula.Mamatha |

రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను కార్మికులను ఆదుకోవాలని సంఘ కార్మికులు డిమాండ్ చేశారు.

‘ప్రభుత్వం చేనేత సహకార సంఘాల కార్మికుల పై దృష్టి పెట్టాలి’.. కార్మికుల డిమాండ్
X

దిశ, కొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను కార్మికులను ఆదుకోవాలని సంఘ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం టెండర్ విధానాన్ని రద్దు చేసి ఎప్పటిలాగే టీజీఎస్‌సీవో ద్వారా స్టాక్‌ను కొనుగోలు చేయాలని తెలిపారు. సంఘాలలో తయారైన 2026 ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించిన నిల్వ స్టాకులను వెంటనే ఖరీదు చేయాలని కోరారు. ఈ సమస్యల పై త్వరలోనే రాష్ట్ర మంత్రులను సంఘ సభ్యులు అంతా కలిసి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ఆప్కో డైరెక్టర్ అడిగోప్పల సత్యనారాయణ, కార్మిక సంఘం నాయకులు సర్వేశం, చేనేత సమాఖ్య జిల్లా అధ్యక్షులు రామచంద్రం, ఆయా సంఘాల అధ్యక్షులు రమేష్, వెంకటేశం, శంకరయ్య పాల్గొన్నారు.

Next Story