చరిత్ర సృష్టించిన ఒన్స్ జుబేర్.. వింబుల్డన్ ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ మహిళగా..

by Disha Web Desk 13 |
చరిత్ర సృష్టించిన ఒన్స్ జుబేర్.. వింబుల్డన్ ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ మహిళగా..
X

దిశ, వెబ్‌డెస్క్ : వింబుల్డన్ సెమీ ఫైనల్స్‌లో ట్యునీషియా ప్లేయర్ 'ఒన్స్ జబీర్' ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. వింబుల్డన్ ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ మహిళగా రికార్డ్ సాధించింది. గ్రాండ్ స్లామ్ పోటీల్లో ఫైనల్‌కు చేరిన ప్రస్తుత తరంలో తొలి ఆఫ్రికన్ మహిళగా ఒన్స్ జబీర్ నిలిచింది. సెమీ ఫైనల్స్‌లో జర్మనీకి చెందిన టట్జానా మారియాను 6-2, 3-6, 6-1 పాయింట్లతో ఓడించింది. గ్రాండ్ స్లామ్ సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించిన మొదటి అరబ్ ప్లేయర్‌గా చరిత్ర నెలకొల్పిన.. ఒన్స్ జుబేర్ ఫైనల్స్‌కు అందరిని ఆశ్చర్యపరిచింది.

అంతకుముందు 1927 లో ఫ్రెంచ్ ఓపెన్‌ టోర్నీలో సౌతాఫ్రికాకు చెందిన 'ఐరీన్ బౌడర్ పీకాక్' తొలిసారి గ్రాండ్ స్లామ్ చేరిన ఆఫ్రికన్ మహిళగా నిలిచింది. 1959లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టోర్నీలో 'రెనీ షుర్మాన్ స్లామ్' సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్న ఏకైక ఆఫ్రికన్ మహిళగా నిలిచింది. మళ్లీ ఇప్పుడు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ లో తొలిసారి ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ మహిళగా ట్యునీషియా ప్లేయర్ ఒన్స్ జబీర్ రికార్డు సృష్టించింది.



Next Story

Most Viewed