ట్వీట్ చేస్తా... రిప్లై ఇస్తావా... కేటీఆర్‌పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

by Disha Web |
ట్వీట్ చేస్తా... రిప్లై ఇస్తావా... కేటీఆర్‌పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్
X

దిశ, జవహర్ నగర్: మంత్రి కేటీఆర్.. ఇంట్లో కూర్చోని ఓటీటీలో సినిమాలు చూడటం కాదు.. ట్విట్టర్‌లో లైవ్ చూపిస్తా.. దానికి రిప్లై ఇస్తావా.. అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేటీఆర్‌ను ప్రశ్నించారు. జవహర్ నగర్ దమ్మాయిగూడ డంపింగ్ యార్డులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మంత్రిపై మండిపడ్డారు. డంపింగ్ యార్డ్‌తో పరిసర నివాస ప్రాంతాలు కలుషితమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలను ఆయన పరామర్శించారు. కోట్ల రూపాయలతో గ్రీన్ క్యాపింగ్, లిచేడ్ ట్రీట్మెంట్ చేస్తున్నామని మోసపూరిత మాటలతో ఇక్కడి ప్రజలను నమ్మించారని, తక్షణం డంపింగ్ యార్డ్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలకు సన్నద్ధం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

కేటీఆర్ చిత్తశుద్ధి ఉంటే జవహర్ నగర్ దమ్మాయిగూడ ప్రాంతాలకు వచ్చి రాంకీ డంపింగ్ యార్డ్ బాధితులు పడే ఇబ్బందులను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాంకీ డంపింగ్ యార్డ్ నిర్లక్ష్యం కారణంగా దమ్మాయిగూడా, జవహర్ నగర్ పలు కాలనీలల్లో డంపింగ్ యార్డ్ విషపు మురుగు నీళ్లు ఇండ్లలో కొచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. డంపింగ్ యార్డ్ బాధిత ప్రజలను కలిసి వారి గోడును విని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు కొంపల్లి మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed