'నా భర్త నాకు కావాలి... అప్పటివరకు నేను దీక్ష విరమించను'

by Disha Web |
నా భర్త నాకు కావాలి... అప్పటివరకు నేను దీక్ష విరమించను
X

దిశ, లక్షెట్టిపేట: ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతి చేసిన భర్త ఇంటి నుంచి పారిపోవడంతో ఓ యువతి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట సోమవారం ఉదయం నిరాహార దీక్షకు దిగి బైఠాయించింది. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ కు చెందిన మెట్టుపల్లి స్వప్న అనే దళిత యువతి లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెలకు చెందిన మెట్టుపల్లి శ్రీధర్ అనే యువకుడు ప్రేమించుకుని 2021 నవంబర్ 21న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు భర్త ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ చేసి వారి కాపురం చక్కదిద్దారు. ఈమె ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. మూడు నెలల కిందట ఇంట్లో చెప్పా పెట్టకుండా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం ఎదుట దీక్షకు పూనుకుని బైఠాయించింది. తన భర్త తనకు కావాలని, న్యాయం చేసేంతవరకు దీక్ష విరమించేది లేదని పేర్కొంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed