పుష్ప 2.. హనుమకొండలో బ్లేడ్‌‌తో నవ వధువు దారుణం

by Dishanational2 |
పుష్ప 2.. హనుమకొండలో బ్లేడ్‌‌తో నవ వధువు దారుణం
X

దిశ , ఆత్మకూర్ (దామెర): హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దామెర మండలం పసరగొండ గ్రామంలో భార్య, భర్త గొంతు కోసింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మామిడి శెట్టి రాజు అర్చనకు వివాహమై నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. రాజు మల్కపేటలోని ఓ క్రషర్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రాజు ఇంట్లో పడుకొని ఉండగా.. అర్చన బ్లేడ్ తో దాడి చేసింది. ఈ ఘటనలో రాజు మెడకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పెళ్లి అయి నెల రోజులకే భర్తపై హత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.

Next Story

Most Viewed