భర్త ఇంటి ముందు భార్య, కూతురు నిరీక్షణ.. తాళం వేసిన అత్తమామలు

by Batti.Sumithra |

మూడుముళ్ల బంధాన్ని దూరం చేయొద్దని కోరుతూ, తన భర్త కోసం ఓ మహిళ తన కూతురితో కలిసి భర్త ఇంటి ముందు నిరీక్షించిన ఘటన ఖానాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది.

భర్త ఇంటి ముందు భార్య, కూతురు నిరీక్షణ.. తాళం వేసిన అత్తమామలు
X

దిశ, ఖానాపూర్ : మూడుముళ్ల బంధాన్ని దూరం చేయొద్దని కోరుతూ, తన భర్త కోసం ఓ మహిళ తన కూతురితో కలిసి భర్త ఇంటి ముందు నిరీక్షించిన ఘటన ఖానాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన తల్లపల్లి భాగ్య, రాజగౌడ్ దంపతుల కుమారుడు ప్రతాప్‌తో మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామానికి చెందిన నితీషకు ఎనిమిదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ప్రతాప్ ఉద్యోగరీత్యా తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లాడు. అనంతరం వారికి కుమార్తె జన్మించగా, ప్రతాప్ తన భార్యను విదేశాల నుంచి స్వగ్రామానికి పంపించాడు.

అయితే అత్తమామలతో విభేదాలు రావడంతో నీతిష తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అత్తమామలు తనను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె పుట్టినప్పటి నుంచి అత్తమామలు తమను పట్టించుకోవడం లేదని, పెద్దల సమక్షంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపింది. ఎన్నిసార్లు చెప్పినా తమను ఇంటికి తీసుకెళ్లలేదని, ఈ నేపథ్యంలో వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు చేసినట్లు పేర్కొంది. విదేశాల నుంచి తన భర్త స్వగ్రామానికి వచ్చిన విషయం తెలుసుకుని, తన కుమార్తెతో కలిసి భర్త ఇంటికి వెళ్లానని నీతిష తెలిపింది. అయితే తనను చూసిన అత్తమామలు ఇంటికి తాళం వేసి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి బయటకు వెళ్లిపోయారని ఆరోపించింది. తన భర్త తనను, తన కుమార్తెను అంగీకరించి తమతో కలిసి తీసుకెళ్లాలని నీతిష వేడుకుంది.

Next Story