- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే భార్య భర్తకు ఎటువైపు నిద్రపోవాలి..?

దిశ, వెబ్‌డెస్క్: ‘‘భార్యాభర్తల (husband and wife)మధ్య అనుబంధం ఒక అందమైన తోట లాంటిది. దీనిలో ప్రతి మొక్కకు ప్రేమ, సంరక్షణ అవసరం. అంటే భార్యభర్తల బంధంలో ఒకరి కోరికలను అర్థం చేసుకోవడం, ఆ కోరికల్ని గౌరవించడం చాలా ముఖ్యం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తమ భాగస్వామి అభిప్రాయాన్ని తీసుకునే వారు మాత్రమే ఈ అందమైన తోటను మరింత అందంగా మార్చగలరు’’.
అయితే భార్యభర్తలు ఒకే మంచంలో నిద్రపోతారు. మరీ భార్య భర్తకు ఎటు వైపు పడుకుంటే మంచి జరుగుతుంది. ఎలా నిద్రపోతే ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుందో తాజాగా వాస్తు శాస్త్రంలో వెల్లడించిన పలు నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం(Vastu Shastram) ప్రకారం అయితే భర్తకు ఎడమవైపున భార్య నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా నిద్రించడం వల్ల వారి దాంపత్య జీవితంలో ఆనందం, సంపద పెరుగుతాయని చెబుతున్నారు. ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారని.. అంతేకాకుండా వీరి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుందని అంటున్నారు.
ముఖ్యంగా భార్య.. భర్తకు ఎడమవైపున నిద్రపోవడం వల్ల భర్త ఆయుష్షు (life)కూడా పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే మీ బెడ్ రూమ్(Bedroom) కూడా నైరుతి మూలకు ఉండేలా చూసుకోండని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బెడ్ రూమ్ లో పెట్టే పెయింట్స్ కూడా లైట్ కలర్స్ ఉండాలి. లేత నీలం, పీచ్, లైట్ పింక్ వంటివి ఉంటే బెటర్. మంచం కూడా నైతురి మూలలో మంచాన్ని పెట్టాలని.. దీంతో వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా కలిసిమెలిసి జీవిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.