రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ముసుగు తొలిగేది ఎన్నడు ?

by Batti.Sumithra |

రెబ్బెన మండల కేంద్రం నుంచి గంగాపూర్, నంబాల గ్రామాలకు వెళ్లే మార్గంలోని జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అడ్డంగా ఉందని తొలగించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం మరిచిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ముసుగు తొలిగేది ఎన్నడు ?
X

దిశ, రెబ్బెన : రెబ్బెన మండల కేంద్రం నుంచి గంగాపూర్, నంబాల గ్రామాలకు వెళ్లే మార్గంలోని జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అడ్డంగా ఉందని తొలగించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం మరిచిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా రైతు వేదిక వద్ద ముసుగు కప్పి ఉంచడం పై ప్రజలు, మేధావులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం అవమానకరమని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని కోరుతున్నారు. అంబేద్కర్ విగ్రహ పునఃప్రతిష్ఠాపన కోసం ఒక గుంట స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్, జిల్లా కలెక్టర్‌లకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని కేటాయిస్తే అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తామని కుల సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

Next Story