కేరళ వెళ్లి యూపీ ప్రజలను తిట్టారు: కుటుంబ పార్టీలపై మండిపడ్డ ప్రధాని

by Web Desk |
కేరళ వెళ్లి యూపీ ప్రజలను తిట్టారు: కుటుంబ పార్టీలపై మండిపడ్డ ప్రధాని
X

లక్నో: కుటుంబవాదులు అమేథీలో ఓడిపోతే కేరళ వెళ్లి యూపీ ప్రజలను తిట్టడం మొదలు పెట్టారని ప్రధాని అన్నారు. గురువారం అమేథీ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. '2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కుటుంబవాదులు (కాంగ్రెస్‌ను ఉద్దేశించి) ఎవరికీ చెందిన వారు కాదని అమేథీ ప్రజలకు తెలుసు. మీరు చాలా కాలంగా ఈ కుటుంబాలకు నమ్మకస్తులు గా ఉన్నారు. కానీ వారు ఓడిన మరుక్షణమే కేరళకు వెళ్లి మీ తెలివిని తిట్టడం ప్రారంభించారు' అని అన్నారు. క్షేత్ర స్థాయి అంచనాలకు కుటుంబ పార్టీలు చాలా దూరం ఉన్నాయని తెలిపారు. వీరు అధికారంలో ఉన్నప్పుడు తమను తాము రాజుల్లాగా భావిస్తారని చెప్పారు. అయితే బీజేపీ బలం మాఫియా కాదని, యూపీ ప్రజలే‌నని నొక్కి చెప్పారు. కుటుంబ రాజకీయాలు దేశాన్ని బాధిస్తాయని తెలిపారు. 'కుటుంబ రాజకీయాల్లో, తన సభ్యులకు సమానంగా ముఖ్యమైన పదవులు అప్పగిస్తారు. ప్రభుత్వంలోని ప్రాధాన్యత గత పోస్టులను ఈ కుటుంబ పార్టీలు గుప్పిట్లో ఉంచుకుంటాయి' అని విమర్శించారు. అయితే వ్యాక్సిన్ కోసం 100 ఏళ్ల తన తల్లి క్యూలైన్ లో నిల్చొని, తన వంతు రాగానే టీకా తీసుకుందని అన్నారు. అయితే కుటుంబవాదులు మాత్రం లైన్ వదిలేసి ముందుకెళ్తారని ఆరోపించారు. ఇతర పార్టీల నిర్ణయాలు ఓటు బ్యాంక్ ఆధారంగా ఉంటాయని చెప్పారు. నేటి(గురువారం) పీఎం కిసాన్ పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తైనట్లు తెలిపారు. తన జీవితంలో ఇదొ ప్రత్యేక దినమని అన్నారు. అమేథీ రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా రూ.450 కోట్లకు పైగా ప్రయోజనం పొందారని చెప్పారు. కాగా ఐదో దశలో 60 స్థానాలకు గాను ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి.

Next Story