వాట్సాప్ సరికొత్త ఫ్యూచర్.. ఇకపై గ్రూప్ కాల్‌లో ఆ వెసులుబాటు..

by Dishafeatures2 |
వాట్సాప్ సరికొత్త ఫ్యూచర్.. ఇకపై గ్రూప్ కాల్‌లో ఆ వెసులుబాటు..
X

దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ ఈ యాప్ తెలియని వారు ఉండరు. దాదాపు ప్రతి మొబైల్‌లో ఈ యాప్ ఉంటుంది. మెసేజెస్, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ కోసం ప్రస్తుతం ఎక్కువగా వాట్సాప్‌నే వినియోగిస్తుంటారు. వాట్సాప్ యాజమాన్యం సైతం ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు అనువుగా అప్లికేషన్‌లో మార్పులను చేస్తుంది. ఇదే క్రమంలో వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గ్రూప్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఎవరి దగ్గరైనా డిస్టర్బన్స్ వస్తుంటే మొత్తానికి మ్యూట్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల మిగతా గ్రూప్ మెంబర్స్ మాట్లాడేది కూడా మ్యూట్ అవుతుంది. ఈ సమస్యకు చెక్ చెప్తూనే వాట్సాప్ తన కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇకపై గ్రూప్ కాల్స్‌‌లో ఒక్కొక్కరిని మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన వ్యక్తిని అతడి వాయిస్ మాత్రమే వినిపించకుండా మ్యూట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రూప్ కాల్స్ జరుగుతుండగా ఒకరికొకరు మెసేజ్ చేసుకునే వెసులుబాటును కూడా తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది.


Next Story

Most Viewed