కలవరపెడుతున్న 'ఎస్‌ఎమ్‌ఎస్ బాంబింగ్'..

by Disha Web |
కలవరపెడుతున్న ఎస్‌ఎమ్‌ఎస్ బాంబింగ్..
X

దిశ, ఫీచర్స్ : ఆటోమేటిక్ టూల్ ద్వారా ఒకే వ్యక్తికి తక్కువ సమయంలో ఎక్కువ మెసేజెస్ లేదా ఓటీపీలు పంపే చర్యను 'ఎస్‌ఎమ్‌ఎస్ బాంబింగ్' లేదా 'టెక్ట్స్ బాంబింగ్' అంటారు. అంతేకాదు అనేక ఫోన్ నంబర్స్‌కు ముందుగా కంపోజ్ చేసిన టెక్స్ట్‌ పంపడాన్ని కూడా SMS బాంబింగ్‌గా వర్గీకరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ 'ఎస్‌ఎమ్‌ఎస్ బాంబింగ్' ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని బటన్స్ క్లిక్‌ చేస్తే పెద్ద సంఖ్యలో వ్యక్తులను చేరుకునే సామర్థ్యం ఉన్నందున 'ఉత్పత్తి లేదా సేవా' రంగంలో దీన్ని మార్కెటింగ్‌ టెక్నిక్‌గా ఉపయోగించుకుంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే.. కొంతమంది SMS బాంబింగ్‌తో జీవనోపాధి పొందుతున్నారు.

జోమాటో, జెప్టో, లీషియస్ వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు 'ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అపోలో' వంటి ఆన్‌లైన్ స్టోర్స్ నుంచి వందల కొద్దీ మెసేజెస్, ఓటీపీ సందేశాలు వస్తున్నట్లుగా అనేకమంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇవి తమ పనికి అంతరాయం కలిగించడమే కాక చికాకు పెడుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. అయితే సైబర్ పోలీసులు కూడా ఈ స్పామ్ మెసేజెస్‌ను ఆపలేకపోతున్నారు.

SMS బాంబర్స్‌ను ఉపయోగించడాన్ని వేధింపుగా పరిగణించవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి యాప్స్/వెబ్‌సైట్స్‌కు సరైన గోప్యతా విధానం లేదా సేవా నిబంధనలు లేవని, ఇది అపారమైన హానిని సృష్టించవచ్చని వారంటున్నారు. వ్యక్తులను వేధించేందుకు కూడా ఈ విధానాన్ని ఉపయోగించవచ్చని, వీటి నియంత్రణకు బ్లాకింగ్ ఎస్‌ఎమ్‌ఎస్/యాంటీ-SMS బాంబర్‌ యాప్స్ ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు. ఇవి ఏదైనా OTP లేదా అదే SMS మూడు కంటే ఎక్కువసార్లు వస్తే.. సదరు నెంబర్ లేదా యాప్ నుంచే వచ్చే సందేశాలను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తాయి.

వాస్తవానికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఫ్రీవేర్ ఎస్‌ఎమ్‌ఎస్ బాంబింగ్ యాప్స్, వాటి apk ఫైల్స్‌ను ఉపయోగించి క్రిమినల్స్ ఇలాంటి చర్యలకు పాల్పడతారు. ప్రసిద్ధ SMS బాంబింగ్ యాప్స్‌లో SMSBomber, BombItUp, TXTBlast వంటివి ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఆయా వెబ్‌సైట్స్ ఇతర సంస్థల హాని కలిగించే API పాయింట్స్‌ను ఉపయోగిస్తాయి. వాస్తవానికి ఇవి OTP, లాగిన్, పాస్‌వర్డ్ రీసెట్ మొదలైన సేవల కోసం చట్టబద్ధ యూజర్లకు టెక్స్ట్‌ పంపేందుకు వినియోగించబడతాయి. అయితే, దాడి చేసేవారు ఈ APIలను హ్యాక్ చేసి, వారి స్క్రిప్ట్‌లతో GET/POST రిక్వెస్ట్‌లు చేయడం ద్వారా మెసేజెస్‌ను పదుల సంఖ్యలో ఆటోమేటిక్‌గా పంపిస్తారు. ఇలాంటి SMS బాంబర్ సాధనాలను ఉపయోగించడం చాలా సులభం. వినియోగదారులు కేవలం నంబర్, మెసేజ్‌ల సంఖ్య నమోదు చేసుకుని సబ్మిట్ బటన్‌ నొక్కితే చాలు.. సదరు యాజర్‌కు ఆ మెసేజ్‌లు వెళ్లిపోతాయి.

- సౌరజీత్ మజుందార్, సైబర్ నిపుణుడు


Next Story

Most Viewed