- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
biphasic sleep: బైపాసిక్ స్లీప్ అంటే ఏంటి.. కలిగే ప్రయోజనాలు..?

దిశ, వెబ్‌డెస్క్: 24 గంటల సమయంలో కేవలం ఒకసారి మాత్రమే కాకుండా రెండు సార్లుగా నిద్రపోవడాన్నే బైపాసిక్ స్లీప్ (biphasic sleep) అని అంటారు. అంటే రాత్రి సమయాల్లో నిద్రించే ఆరు, ఏడు గంటల నిద్రతో పాటు పగటి పూట ఒక గంట కంటే తక్కువ సమయం నిద్రపోవాలట. ఇలా చేయడం వల్ల మెమొరీ మెరుగై, మీలో ఉత్పాదకత వక్తి పెరుగుతుంది. ఇంకా మూడ్ స్థిరంగా ఉండి.. పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇలా పడుకోవడం వల్ల బాడీకి, మనసుకు ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జ్జాపకశక్తి (Memory Power) మెరుగుపడి.. మెదడు పనితీరు (Brain function) కూడా బాగుంటుందని అంటున్నారు. అలాగే టైడ్ అవుతే మీలో తక్షణ ఉత్పాదకత శక్తి (Instant productivity power)ని కూడా పెంచడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా బైపాసిక్ స్లీప్ (biphasic sleep).. మీలోని ఆందోళనను, ఒత్తిని తగ్గిస్తుంది(Reduces stress).
గుండె జబ్బుల రిస్క్(Risk of heart disease) కూడా తగ్గించి.. ఇమ్యూనిటీ పవర్(Immunity power)ను పెంచడంలో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జీవక్రియల(Metabolism)ను కంట్రోల్‌లో ఉంచుతుంది. అయితే ఈ బైపాసిక్ స్లీప్ ఎలా ప్రాక్టీస్ చేయాలో తాజాగా నిపుణులు చెప్పిన తీరు చూద్దాం..
క్రమంగా అలవాటు చేసుకోవాలి. నైట్ సమయంలో నిద్రను తగ్గించి.. మధ్యాహ్నం పూట షార్ట్ స్లీప్ సాధ్యం అవుతుందని అంటున్నారు. అలాగే మీలోని శక్తి స్థాయిల్ని(Energy levels), మారుతున్న జీవన విధానాన్ని చర్చించుకోండి. దీని ప్రకారం వాటి షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకోండని సూచించారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.