- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Alzheimers: నోటిలోని బ్యాక్టీరియా మెదడుకు ఏం సంబంధం.. !!

దిశ, వెబ్‌డెస్క్: నోటిలో బ్యాక్టీరియా(Bacteria) ఉండడం సహజం. నోటిలోని బ్యాక్టీరియా కొన్నిసార్లు నోటి ఆరోగ్యా(oral health)నికి హానికరంగా ఉంటాయి. నోటిలోని బ్యాక్టీరియా, దంతాలు(teeth), చిగుళ్ళు(gums), బుగ్గలు, గొంతు వెనుక, నాలుక(tongue) వంటి ప్రాంతాల్లో ఉంటాయి. నోటిలోని బ్యాక్టీరియా, ఆహారం అండ్ పానీయాలలోని చక్కెరలను తింటాయి. అలాగే చక్కెరను తినే బ్యాక్టీరియా, దాన్ని ఆమ్లం(acid)గా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆమ్లం, దంతాల ఉపరితలంపై క్షయా(decay)నికి దారితీస్తుంది. లాక్టోబాసిల్లస్(Lactobacillus), స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్(Streptococcus mutans), పోర్ఫిరోమోనాస్ జింగివాలిస్(Porphyromonas gingivalis), స్టెఫిలోకాకస్(Staphylococcus) వంటివి నోటిలో ఉండే బ్యాక్టీరియా అని నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాసన, నోటిలోని బ్యాక్టీరియా, చిగుళ్ల వ్యాధి (Gum disease) వంటి సమస్యలకు దారితీస్తాయి. నోటిలో 700కు పైగా బ్యాక్టీరియా జాతులు, వైరస్‌లు, శిలీంధ్రాలు(Viruses and fungi), ఆర్కియా(Archaea), ప్రోటోజోవా(Protozoa) వంటివి ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
అయితే నోటిలోని బ్యాక్టీరియాలో ఈ వ్యాధిని ముందే కనిపెట్టవచ్చని తాజాగా నిపుణులు చెబుతున్నారు. నోటిలోని బ్యాక్టీరియా రక్త ప్రవాహం(blood flow)లోకి చేరుకుని.. మెదడుకు హాని కలిగిస్తుందని పరిశోధనలో తేలింది. అలాగే జ్జాపకశక్తిని కోల్పోవడం(Loss of appetite), మెదడు పనితీరు తగ్గడం వంటివి జరుగుతాయి. మెమోరీ పవర్ (Memory Power) ఏర్పడటానికి అవసరమై నైట్రేట్ ను నైటిక్ ఆక్సైడ్(Nitric oxide) గా మార్చడాన్ని తగ్గిస్తుందట.
మెదడు ఆరోగ్యం(Brain health) క్షీణించడంతో పాటు.. దంత సమస్యలు(Dental problems) కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. నోటి ఆరోగ్యానికి మెదడుకు కూడా సంబంధం ఉందని అంటున్నారు. కాగా నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కష్టమని నిపుణులు అంటున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.